
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించిన ‘శాకుంతలం’ సినిమా ఫిభ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
శకుంతల, దుష్యంత రాజుల పౌరాణిక ప్రేమ గాధ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని అద్భుత ప్రేమకావ్యంగా తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. అల్లు అర్జున్ కుమార్తె అర్హ ఈ సినిమాలో చిన్నారి భరతుడిగా (శకుంతల, దుష్యంతుల కుమారుడు) కనిపించబోతోంది.
నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్, గుణా టీం వర్క్స్ బ్యానర్లపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి.
సమంత నటించిన పాన్ ఇండియా మూవీ యశోద అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడే సమంతకి మయో సైటీస్ అనే ఓ అరుదైన వ్యాధి బారిన పడింది. దానికి ఎటువంటి మందులు, చికిత్స లేకపోవడంతో ఆమె ఆయుర్వేద చికిత్స తీసుకొంటున్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగానే సమంత చేతిలో ఉన్న సినిమాలని మొదలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇదివరకే ఆమె పూర్తిచేసిన శాకుంతలం సినిమా ఇప్పుడు విడుదల కాబోతుండటం చాలా సంతోషం కలిగించే విషయమే కదా? సమంత త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలు చేయాలని ఆశిద్దాం.
Witness the #EpicLoveStory #Shaakuntalam in theatres near you from Feb 17th 2023 Worldwide! Also in 3D 🦢@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #MythologyforMilennials #ShaakuntalamOnFeb17 pic.twitter.com/El9INBB4gg