అవును.. నవీన్ పోలిశెట్టి జాతిరత్నమే!

జాతి రత్నాలు సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టికి ఓ రేంజిలో ఫాలోయింగ్ ఏర్పడింది. కనుక నవీన్ పోలిశెట్టి ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆప్యాయంగా పలకరించిన తర్వాత నీ సినిమా అప్‌డేట్స్ ఏమిటి? అని అడుగుతున్నారు. మొదట్లో నవీన్ తాను చేస్తున్న సినిమాల గురించి చెపుతుండేవాడు. అలా అందరూ అప్‌డేట్స్ గురించి అడుగుతుంటే నవీన్ పోలిశెట్టికి అప్‌డేట్స్ తోనే చిన్న ఫన్నీ వీడియో తీస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. ఇంకేముంది... తనదైన శైలిలో చకచకా ఓ వీడియో తీసి నూతన సంవత్సరం సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టేశాడు. అది చూస్తే నవ్వాపుకోలేరు. అంత బాగుంది. మరింకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోని ఓ లుక్‌ వేసేయండి.     

(Video Courtecy: Eenadu Media)