రోర్ ఆఫ్ వీరసింహారెడ్డి... మేకింగ్ వీడియో!

నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరాసింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నేటితో 2022 సంవత్సరం పూర్తయి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నందున బాలయ్య అభిమానుల కోసం ‘రోర్ ఆఫ్ వీరసింహారెడ్డి’ పేరుతో ఈ సినిమాలో కొన్ని కీలక సన్నెవేశాల మేకింగ్ వీడియోని ఈరోజు విడుదల చేశారు. కొన్ని ఫైట్ సీన్స్, ఓ ఊరేగింపు, సామూహిక వివాహ కార్యక్రమం, గుడి ఆవరణలో డ్యాన్స్ సీక్వెన్స్ వగైరాలను ఈ వీడియోలో చూపారు. వాటిలో బాలయ్య నలుపు, తెలుపు డ్రెస్సులలో చేసిన ఒకటి కొన్ని షాట్స్, హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌తో సహా నటీనటులను చూపారు. 

వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, లాల్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కెమెరా రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్.ధమన్ అందిస్తున్నారు.