
బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో ఉందో దానికి అంత చెడ్డపేరు కూడా ఉంది. దానిలో పాల్గొనే జంటలు బరితెగించిన్నట్లు వ్యవహరిస్తుండటమే అందుకు కారణం. అయితే సరిగ్గా అటువంటి హాట్ హాట్ సన్నివేశాల కోసమే చూసేవారు కోకొల్లలు ఉన్నారు. అందుకే బిగ్‌బాస్ షోకి ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక సీజన్ పూర్తికాగానే మరొకటి చొప్పున వరుసగా ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తయిపోయాయి. ఇప్పుడు ఏడవ సీజన్‌కి రంగం సిద్దమవుతోంది. అయితే ఈ సీజన్‌కి నాగార్జునకి బదులు బాలయ్య లేదా రానా హోస్ట్‌గా ఉండవచ్చని వార్తలు వినిపించినప్పటికీ తాజాగా మంచు విష్ణు పేరు వినిపిస్తోంది. బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఇటీవలే మంచు విష్ణుని కలిసి మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించిన్నట్లు సమాచారం. మంచు విష్ణు చేసిన తాజా చిత్రం జిన్నా దారుణంగా ఫ్లాప్ అవడంతో మరో కొత్త ప్రాజెక్టు ప్రారంభించేందుకు కాస్త గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నారు. కనుక ఆ గ్యాప్‌లో ఈ ఆఫర్ రావడంతో అంగీకరించిన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఇంకా ధృవీకరించాల్సి ఉంది.