ఈరోజు సాయంత్రమే... పూనకాలు లోడింగ్!

 కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్ జంటగా జనవరి 13న వాల్తేర్ వీరయ్య విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, రవితేజ వంటి ఇద్దరు మాస్ హీరోలు కలిసి చేస్తే ఆ సినిమా ఎంత మమ్మామాస్‌గా ఉంటుందో చెప్పక్కరలేదు. ఇక వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే? అభిమానులకు పూనకాలే! అందుకే ‘పూనకాలు లోడింగ్’ అంటూ వాల్తేర్ వీరయ్య చిత్ర బృందం అభిమానులను ఒకటే ఊరిస్తోంది. ఈరోజు సాయంత్రం 6.03 గంటలకి ఆ పాటని రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబందించిన ఓ స్టిల్ విడుదల చేయగా దానికీ సోషల్ మీడియాలో మంచి లైక్స్ వచ్చాయి. కనుక పూనకాలు లోడింగ్ ఎలా ఉంటుందో మరోకొద్ది సేపటిలో అందరూ స్వయంగా చూడొచ్చు.  

వాల్తేర్ వీరయ్య సినిమాలో కేథరిన్ థెరీసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కృషోర్, బాబీ సింహా ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దీనిలో బాలీవుడ్‌లో భామ ఊర్వశీ రౌతేల, మెగాస్టార్ చిరంజీవితో కలిసి “బాస్ పార్టీ...” అంటూ చేసిన డ్యాన్స్‌కి, అలాగే విదేశాలలో చిరంజీవి, శ్రుతీహాసన్ చేసిన నువ్వు శ్రీదేవివైతే... నేను చిరంజీవినంటా… అనే పాట, డ్యాన్స్ రెంటికీ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమాని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కధ, డైలాగ్స్: బాబి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందించారు.