మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్ జంటగా చేస్తున్న వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్ విడుదలైంది. ‘భగభగమని మండే మగాడు వీడే...’ అంటూ సాగే చంద్రబోస్ రచించిన ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ చాలా ఫాస్ట్ బీట్‌తో పవర్ ఫుల్‌గా స్వరపరచగా అనురాగ్ కులకర్ణి అభిమానులను ఊర్రూతలూగించేలా పాడారు. ఈ పాటలో చిరంజీవి ఇంట్రడక్షన్ కూడా అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్‌లో చుట్టూ తుపాకులు గురిపెట్టి ఉండగా జీపులో నుంచి చిరంజీవి దిగి స్టైల్‌గా సిగరెట్ వెలిగించుకొంటున్నట్లు చూపడం ద్వారా దేనికీ అదరడు బెదరడన్నట్లు చూపారు.
బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్యలో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా కేథరిన్ థెరీసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బాబీ సింహా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో భామ ఊర్వశీ రౌతేల చిరంజీవితో కలిసి ‘బాస్ పార్టీ...’ అంటూ చేసిన ఐటెమ్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వాల్తేర్ వీరయ్య సినిమాని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కధ, డైలాగ్స్: బాబి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న వాల్తేర్ వీరయ్య చిత్రం విడుదల కాబోతోంది.