
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా చేసిన ధమాకా చిత్రం ఊహించని స్థాయిలో కలక్షన్స్ రాబడుతుండటం విశేషం. డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్లు కలక్షన్స్ రాబట్టడం విశేషం. ఇంకా న్యూఇయర్ హడావుడి కూడా ఉంది కనుక ఇదేవిదంగా కలక్షన్స్ రాబడుతుందని భావించవచ్చు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ వరకు కాస్త నిలకడగా ఆడితే చాలు మళ్ళీ కలక్షన్స్ కనక వర్షమే కురుస్తుంది. ధమాకా కధలో కొత్తదనం ఏమీ లేనప్పటికీ దర్శకుడు నక్కిన త్రినాధరావు మాస్ మహారాజ అభిమానులకు కావలసినవన్నీ ఈ సినిమాలో చక్కగా వడ్డించారు. రవితేజ కూడా తనకు సరిపడే డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్స్ దొరకడంతో విరగదీసేశాడు. ఇంకేముంది... ఓ సాధారణ కమర్షియల్ సినిమా సూపర్ హిట్ అయిపోయింది.
ఈ సినిమాని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూడు రోజులలో రూ.32 కోట్లు కలక్షన్స్ వచ్చాయని ట్విట్టర్ ద్వారా రవితేజ అభిమానులతో పంచుకొంది.