రాజకీయాలలోకి రామ్ చరణ్‌?

అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ రాజకీయాలో ప్రవేశిస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. అయితే నిజ జీవితంలో కాదు... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో! దానిలో రామ్ చరణ్‌ అభ్యుదయం పార్టీ అభ్యర్ధిగా ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు, దానికి సంబందించి విశాఖపట్నంలో జరుగబోతున్న సభకి హాజరవుతున్న ఆయనకి స్వాగతం చెపుతూ స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. పసుపు రంగులో ఉన్న ఆ తోరణంలో కుడి, ఎడమ, పై భాగంలో రామ్ చరణ్‌ ఫోటోలు ఉన్నాయి. దాని వెనుక వరుసగా రంగురంగుల తోరణాలు కట్టారు. యూనిట్ సిబ్బంది స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తుండగా తీసిన ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. 

ఈ సినిమాలో రామ్ చరణ్‌ డబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి పాత్రలో రామ్ చరణ్‌కు జోడీగా అంజలి, కొడుకు పాత్రకు జోడీగా కియరా అద్వానీ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో  దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై ఈ సినిమాను సుమారు నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కధతో రూపొందున్న ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. కెమెరా తిరు, ఆర్‌ రత్నవేలు, థమన్ సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించి హైదరాబాద్‌, విశాఖపట్నం, మహారాష్ట్ర, పంజాబ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్‌ ఓ ఎన్నికల సభలో రాజకీయ ప్రసంగం చేస్తున్న సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు.