తెలుగు సినీ పరిశ్రమలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ హీరోల మద్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండటం విశేషం. అగ్ర హీరోలేనాడూ పరస్పరం విమర్శించుకోకుండా ఒకరి సినిమా ప్రమోషన్స్‌లకు మరొకరు హాజరవుతూ అందరి సినిమాలు బాగా ఆడాలని కోరుకొంటుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సెట్‌కి వెళ్ళి బాలయ్యతో సహా అందరినీ ఆప్యాయంగా పలకరించి, సినిమా షూటింగ్ పురోగతి గురించి అడిగి తెలుసుకొన్నారు. బాలయ్య పవన్ కళ్యాణ్‌ని ఆప్యాయంగా ఆహ్వానించి హరిహరవీరమల్లు షూటింగ్ ఎలా సాగుతోందో అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులతో ఇద్దరూ సెల్ఫీలు దిగారు.
ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో త్వరలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అలాగే బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయాలలో ఉన్నారు. బాలయ్య టిడిపిలో పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్నారు. ఏపీలో జనసేన, టిడిపిలు పొత్తులు పెట్టుకోబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఇటు సినిమాలలో అటు రాజకీయాలలో కూడా బాలయ్య, పవన్ కళ్యాణ్ మద్య బలమైన బందమే ఉన్నట్లు భావించవచ్చు.