ఓటీటీలో ప్రియమణి విస్మయం

ఒకప్పుడు పెద్ద హీరోలందరితో సినిమాలు చేసిన ప్రియమణిని ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ పక్కన పెట్టేసింది. కనుక ఆమె తమిళ్, కన్నడ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆమె చేసిన కన్నడలో సూపర్ హిట్ అయిన ‘నన్న ప్రకార’ చిత్రాన్ని తెలుగులో విస్మయ పేరుతో డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. తెలుగులో కూడా ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకొంటోంది. ఈ సినిమాలో కిషోర్(కాంతారా ఫేమ్), మయూరి క్యాతరి, ప్రమోద్ శెట్టి, గిరిజ లోకేశ్, అర్జున్ యోగి, నిరంజన్ దేశ్ పాండే ముఖ్యపాత్రలు చేశారు. 

క్రైమ్, సస్పెన్స్ జోనర్‌లో తీసిన ఈ సినిమాలో మూడు వేర్వేరు కధలుంటాయి. వాటిలో జరిగిన హత్యలపై కిషోర్ పోలీస్ ఆఫీసరుగా దర్యాప్తు చేస్తాడు. అది ఎక్కడా బోర్ కొత్తకుండా చాలా ఆసక్తికరంగా మలుపులు తిప్పుతూ చివరికి మూడు కధలని అద్భుతంగా కనెక్ట్ చేసి చూపాడు దర్శకుడు వినయ్ బాలాజీ. విశేషమేమిటంటే అతనికి ఇదే తొలి సినిమా. అంతకు ముందు అతను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాడు.  వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పనిచేశాడు. అయినప్పటికీ ఈ సినిమాని అందరూ విస్మయం చెందేలా అద్భుతంగా తెరకెక్కించాడు.

ఈ సినిమాలో ప్రియమణి డాక్టరుగా నటించింది. ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: వినయ్ బాలాజీ, కెమెరా: మనోహర జోషి, సంగీతం: అర్జున్ రామ్ అందించారు.