ప్రభాస్, గోపీచంద్, బాలయ్య అన్‌స్టాపబుల్‌ ప్రమో!

ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్-2 టాక్ షోలో ఈసారి టాలీవుడ్‌ నటులు ప్రభాస్‌, గోపీచంద్‌ సందడి చేశారు. ముగ్గురు నటులకి భారీగా అభిమానులున్నారు. ముఖ్యంగా బాలయ్యకి, పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయిన ప్రభాస్‌కి భారీగా అభిమానులున్నారు. ఈ కార్యక్రమానికి సంబందించి ప్రమోని యూట్యూబ్‌లో విడుదల చేయగానే అభిమానులకి పండగే అయ్యింది. కొన్ని గంటల వ్యవధిలోనే 1.4 మిలియన్ లైక్స్, 1.3 కోట్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక ప్రభాస్‌ఆన్ఆహా హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే దానికీ మంచి స్పందన వచ్చింది. ఈ నెల 30న ఆహా ఓటీటీలో వారి కార్యక్రమం ప్రసారం కాబోతోంది.