భూతకోల వేడుకలలో అనుష్క శెట్టి

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన కాంతారా సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటి వరకు కేరళకి చెందిన కధాకళి నృత్యం గుర్తించి మాత్రమే దేశ ప్రజలకి తెలుసు. కాంతర సినిమాతో తొలిసారిగా దక్షిణ కర్ణాటకలో సుప్రసిద్దమైన భూతకోల నృత్యం వారి ఆచార వ్యవహారాలు దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించాయి. కర్ణాటకలో ఇక చెప్పనే అక్కరలేదు. ప్రస్తుతం కర్ణాటకలోని అనుష్క శెట్టి స్వస్థలం మంగళూరులో ఈ భూతకోల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆమె సాంప్రదాయబద్దంగా చీర కట్టుకొనివచ్చి ఆ వేడుకలలో పాల్గొన్నారు. తర్వాత తన మొబైల్ కెమెరాతో భూతకోల నృత్యాన్ని షూట్ చేసి దానిని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకొన్నారు. ఆ వేడుకలకి హాజరైన ఆమెను అభిమానులు తమ మొబైల్ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీసుకొని వారు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్-కెలో అనుష్క శెట్టి ఓ ప్రధానపాత్ర చేస్తోంది.