తమిళంలో సూపర్ హిట్ అయిన లవ్ టుడే ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. అయితే దాని తెలుగు డబ్బింగ్ తెలుగు వెర్షన్ ఇంతవరకు విడుదలకాకపోవడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఈ నెల 25వ తేదీన క్రిస్‌మస్ పండుగ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో లవ్ టుడే తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదలచేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
ప్రదీప్ రంగనాధన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించి ప్రధానపాత్ర చేసిన ఈ సినిమాలో అతనితో ఇవానా జంటగా నటించింది. ఇంకా సత్యరాజ్, రాధిక, రవీనా రవి, అక్షయ ఉదయ కుమార్, యోగిబాబు, రాధికా శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.60 కలక్షన్స్ రాబట్టి నిర్మాతలకి కనకవర్షం కురిపించింది. ఓ యువజంట ప్రేమని మరో కొత్త కోణంలో చూపడంతో ఈ సినిమాతో యువత బాగా కనెక్ట్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో కూడా లవ్ టుడే వచ్చేస్తోంది కనుక తెలుగు ప్రేక్షకులు కూడా చూసి ఆనందించవచ్చు.