టాలీవుడ్‌లో మరో కొత్త బ్యానర్‌.. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌!

ప్రముఖ నిర్మాత దిల్‌దిల్‌రాజు సొంత బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌లో అనేక మంచి చిత్రాలు, సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా దిల్‌రాజు ప్రొడక్షన్స్ అనే మరో బ్యానర్‌ ఏర్పాటు చేసారు. శుక్రవారం ఈ బ్యానర్‌ లోగోని దిల్‌రాజు విడుదల చేశారు. 

ఈ బ్యానర్‌పై హర్షిత్, హన్షితలు నిర్మాతలుగా ‘బలగం’ అనే తొలి సినిమాని నిర్మిస్తున్నారు. నటుడు వేణు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ, “మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో తీసిన బొమ్మరిల్లు, శతమానం భవతి వంటి చిత్రాలు మాకు మంచిపేరు, డబ్బుతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా సంపాదించిపెట్టాయి. ఇప్పుడు ఈ కొత్త బ్యానర్‌లో కూడా అటువంటి మంచి చిత్రాలు అందించాలనుకొంటున్నాము. తెలంగాణలోని సిరిసిల్లా పట్టణం నేపధ్యంలో సాగే కధని వేణు ఈ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దీనిని ఎమ్మోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిస్తున్నాము. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు,” అని చెప్పారు.