ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ట్విట్టర్‌లో ఓ అనూహ్యమైన సందేశం పెట్టారు. అది చిరంజీవి అభిమానులను సంతోషంతో ముంచెత్తుతుందని చెప్పక తప్పదు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రాహుల్ సిప్లీ గంజ్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, పోనీ వర్మ, ఆలీ రేజ తదితరులు ముఖ్యపాత్రలలో రంగమార్తాండ సినిమా పూర్తి చేశారు. ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరంజీవి కవితలు కూడా చెప్పారని దర్శకుడు కృష్ణ వంశీ ట్విట్టర్‌లో బయటపెట్టారు.
“నట మార్తాండ పద్మభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి గళమాధుర్యంలో ధ్వనించిన “నేనొక నటుడుని..” అంటూ రంగమార్తాండలో కవితాఝరిని ఈ నెల21వ తేదీన ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. చిరంజీవి నటన చూశాం... అద్భుతమైన డ్యాన్సులు చూశాం... ఇంకా అద్భుతమైన ఫైట్స్ చూశాం... కానీ కవితా పఠనం ఎప్పుడూ చూడలేదు. కనుక డిసెంబర్ 21 వరకు వేచి చూడాల్సిందే.