సంబంధిత వార్తలు
సాయి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన మసూద హారర్ చిత్రం గత నెల 18న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. నేటికీ మంచి కలక్షన్స్ రాబడుతోంది. ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలకాబోతోంది. ఆహా సంస్థ స్వయంగా ట్విట్టర్‌లో ఈ విషయం ప్రకటించింది.
మసూద చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవీ శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, అఖిలా రామ్ చరణ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం ప్రశాంత్ విహారి, కెమెరా: నాగేశ్ బానెల్, ఎడిటింగ్: జెస్విన్ ప్రభు, ఆర్టిస్ట్: క్రాంతి ప్రియం అందించారు.