అల్లు అర్జున్‌కి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఈరోజు హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన జీక్యూ అవార్డు అందుకొన్నారు. వినోదరంగంలో ఈ జీక్యూ అవార్డుని చాలా  గొప్ప అవార్డుగా భావిస్తారు. జీక్యూ అంతర్జాతీయ మ్యాగజైన్ ఏటా వివిద దేశాలలో వినోద రంగంలో సుప్రసిద్ధులైన వారిని గుర్తించి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, విమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తుంటుంది.

ఈ ఏడాది ఈ మ్యాన్ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డుకి అల్లు అర్జున్‌ని ఎంపిక చేయడమే కాక జీక్యూ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్‌ ఫోటోతో కవర్ స్టోరీ కూడా ప్రచురించింది. జీక్యూ ఇండియా ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్‌ చేరుకొని ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో అల్లు అర్జున్‌కి ఈ అవార్డుని అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, “ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు జీక్యూకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. జీక్యూ మ్యాగజైన్ కవర్ పేజీపై నా ఫోటోతో కవర్ స్టోరీ ప్రచురించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. జీవితంలో ఇటువంటి ఉన్నత శిఖరాలు అందుకొనేందుకు నేను చేస్తున్న కృషి ఫలించినందుకు చాలా సంతోషం కలుగుతోంది. నా కృషిని గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు జీక్యూకి మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.

GQ hosts an intimate MOTY event with Allu Arjun, winner of the 2022 Leading Man Award.

“Being on GQ’s cover has always been on my bucket list,” said Allu Arjun @alluarjun #GQMOTY2022 #MadeOfGreatCharacter #ChivasGlassware #GQIndia pic.twitter.com/LRVR4f86Ii
— GQ India (@gqindia) December 14, 2022

ఇంతకు ముందు బాలీవుడ్‌లో పలువురికి జీక్యూ ఈ అవార్డు ఇచ్చింది కానీ దక్షిణాదిలో ఈ అవార్డు అందుకొన్న తొలి హీరో అల్లు అర్జున్‌ మాత్రమే. అల్లు అర్జున్‌ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకొన్నాడు. అల్లు ఖుష్... అభిమానులూ ఖుష్!