వీరసింహా రెడ్డిని సిట్టి సీమా కుట్టిందే...

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభించింది. ఈరోజు ఆ సినిమాలో రెండో పాట సుగుణ సుందరిని విడుదల చేసింది. సీమా కుట్టిందే... సిట్టి సీమా కుట్టిందే... దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే...” అంటూ సాగే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి వ్రాయగా దానిని రామ్ మిరియాల, స్నిగ్ధ శర్మ హుషారుగా పాడారు.  ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎవడోస్తాడో రండి... అంటూ బాలకృష్ణ తాజా పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. 

వీరసింహ రెడ్డి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, లాల్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుమారు రూ.70 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కెమెరా రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్.ధమన్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జనవరి 8న నిర్వహించనునట్లు సమాచారం.