బాలీవుడ్ అగ్ర నటీనటులు షారూక్ ఖాన్, దీపికా పడుకొణే జంటగా నటించిన పఠాన్ సినిమాలో సముద్ర తీరం వద్ద తీసిన ‘బేషరం రంగ్ రో...’ అనే ఓ పాటని ఇటీవల విడుదల చేశారు. దానిలో దీపికా పడుకొణే చిన్న బికినీ వేసుకొని షారూక్ ఖాన్‌తో చేసిన డ్యాన్స్‌లో చాలా అసభ్యకరమైన భంగిమలను ప్రదర్శించింది. అదిచూసి కుర్రకారు హుషారుగా విజిల్స్ వేస్తారేమో కానీ మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి దుస్తులు ధరించి ఆమె చేత అసభ్యకరంగా డ్యాన్స్ చేయించడం ఉద్దేశ్యపూర్వకంగా చేసినదే కనుక తక్షణం దానిలో ఆమె దుస్తులను మార్చాలని లేకుంటే మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శనపై నిషేదం విధించాల్సి ఉంటుందని మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు. ఆ పాటలో ఒకసారి ఆమె కాషాయరంగు బికినీ ధరించి ఉండగా షారూక్ ఖాన్ ఆమెని వెనకి నుంచి హత్తుకొన్నట్లు, మరోసారి ఆమె కాలుని పైకి లేపి పట్టుకొన్నట్లు చూపారు. పైగా ఆ పాట ‘బేషరం రంగ్ రో...’ అంటూ సాగడం మంత్రి ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. ఆ పాటలో దీపికా పడుకొణే హద్దులు దాటినట్లే కనిపిస్తోంది. అయితే బాలీవుడ్‌లో ‘హద్దులు దాటడమే’ ట్రెండ్. కనుక ఇద్దరు అగ్రనటులు ఆ ట్రెండ్ ఫాలో అయినట్లున్నారు.