వాల్తేర్ వీరయ్య రిపోర్టింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాకి సంబందించి ఒక ఆసక్తికరమైన వీడియోని చిరంజీవి తన అభిమానులతో పంచుకొన్నారు. రెండు రోజుల క్రితం అంటే 12వ తేదీన ఫ్రాన్స్‌లో శ్రుతీ హాసన్ కలిసి ఓ సాంగ్ షూటింగ్‌ పూర్తిచేశామని చిరంజీవి చెప్పారు. ఆ లొకేషన్ స్విట్జర్ లాండ్‌కి ఇటలీ దేశాలకి మద్య ఆల్ప్స్ పర్వతశ్రేణి వద్ద ఓ లోయలో ఉందని అక్కడ ఈ పాట షూటింగ్ పూర్తి చేశామని చెప్పారు. దట్టమైన మంచుకురుస్తుండగా ఈ పాటని షూటింగ్ చేయడం కోసం అందరూ చాలా శ్రమించామని తెలిపారు. అయితే అక్కడి అందాలు చూసి ముగ్దుడినైపోయానని అందుకే ఆ లోకేషన్ వీడియోని మీతో షేర్ చేసుకొంటున్నానని చిరంజీవి చెప్పారు. మీ అందరినీ అలరించడం కోసం ఆ మంచులో అందరం చాలా కష్టపడ్డామని చెప్పారు. మైనస్ 8 డిగ్రీల చలిలో ఇద్దరం డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డామని చెప్పారు. త్వరలో ఈ పాటకి సంబందించి లిరికల్ వీడియో విడుదల చేస్తామని చెపుతూ ఈ పాట చిన్న బిట్‌ని ఎవరికీ తెలియకుండా లీక్ చేస్తున్నాను ఎంజాయ్,” అని అంటూ రెండు ఫోటోలని పెట్టారు.

ఈ సినిమాలో కేథరిన్ థెరీసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కృషోర్, బాబీ సింహా ముఖ్యపాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో భామ ఊర్వశీ రౌతేలతో “బాస్ పార్టీ...” అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన డ్యాన్స్‌ కి మంచి స్పందనవస్తోంది.      

వాల్తేర్ వీరయ్య సినిమాని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కధ, డైలాగ్స్: బాబి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతోంది.