కోలీవుడ్ నటుడు విశాల్ నటించిన లాఠీ సినిమా ఈ నెల 22నా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విశాల్ ఆ సినిమా ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నప్పుడు విలేఖరులు పెళ్ళి ఎప్పుడు చేసుకొంటారని ప్రశ్నించగా “పెళ్ళంటే జోక్ కాదు. నేను నా వృత్తి పట్ల ఎంత నిబద్దతతో ఉంటానో పెళ్ళి చేసుకొంటే వ్యక్తిగత జీవితంలోనూ అంతే నిబద్దతతో ఉండాలి. ఇప్పుడు నేను నా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను కనుక ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యం కాదు. కనుక పెళ్ళికి అప్పుడే తొందరలేదు,” అని చెప్పాడు.
“ఇదివరకు నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాత పెళ్ళి చేసుకొంటానని చెప్పారు అదిప్పుడు పూర్తవుతోంది కదా?” అని ప్రశ్నిస్తే “అవును చెప్పాను కానీ అప్పుడే కాదు,” అని జవాబు చెప్పాడు. “అయితే ఎప్పుడు చేసుకొంటారు? అని విలేఖరులు మళ్ళీ అడిగితే విశాల్ కొంటె సమాధానం చెప్పాడు. ‘పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడు పెళ్ళి చేసుకొంటే అప్పుడు,’ అని జవాబు చెప్పాడు.
ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెర కెక్కిన లాఠీ సినిమాలో విశాల్‌కి జోడీగా సునైన నటించింది. రత్నా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా ఈ సినిమాని నిర్మించగా దీనికి సంగీతం: ఎస్.శామ్, ఫోటోగ్రఫీ: బాలసుబ్రహ్మణియన్, బాలకృష్ణ తోట అందించారు.