భవదీయుడు ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యాడు...

పవన్‌ కళ్యాణ్‌, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా టైటిల్ పూజా కార్యక్రమం మొదలయ్యేసరికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మార్చారు. దానికి ‘ఎవడ్రా మనల్ని ఆపేది?’ అంటూ జోడించిన సబ్ టైటిల్‌, ‘ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు,’ అనే మరో చిన్న క్యాప్షన్ ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ మార్క్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని స్పష్టం చేస్తోంది.

నిన్న ఆదివారం హైదరాబాద్‌, రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొత్తగా, ఏఎం రత్నం కెమెరా స్విచ్చాన్ చేశారు. వివి వినాయక్ ముహూర్తపు షాట్‌కి దర్శకత్వం చేశారు.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌ ఆచంట, విశ్వప్రసాద్, దర్శకులు బుచ్చిబాబు, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. సినిమా ప్రారంభ చిత్రంగా విడుదల చేసిన పోస్టరులో పవన్‌ కళ్యాణ్‌ చేతిలో టీగ్లాసు పట్టుకొని హార్లీడేవిడ్‌సన్ బైక్‌ పక్కన స్టైల్‌గా నించున్నట్లు చూపారు. వెనుక ఓ వైపు ఫ్యాక్టరీ పొగ గొట్టాలు, విండ్ మిల్, మరోపక్క హైవోల్టేజ్ విద్యుత్‌ లైన్లు చూపారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అయనంకా బోస్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Ramanaidu Studios for #UstaadBhagatSingh Opening#Mirchi9LIVE pic.twitter.com/sL6XOARC9K
— MIRCHI9 (@Mirchi9) December 11, 2022