
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప (ది రూల్) ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. దీంతో పుష్ప-2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కనుక దర్శకుడు సుకుమార్‌పై ఒత్తిడి పెరిగిపోయి ఉండవచ్చని అందరూ భావించడం సహజం. కానీ సుకుమార్ మాత్రం ఏమాత్రం టెన్షన్ లేకుండా పుష్ప (ది రైజింగ్)ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కొత్తగా అనేక మంది నటీనటులను తీసుకొంటున్నారు.
ఇంకా ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. పుష్ప-2లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతునట్లు సమాచారం. ఈ సినిమాలో కొంచెంసేపే ఓ అతిధిపాత్రలో కనిపించబోతునప్పటికీ ఆ పాత్ర సినిమా కధని మలుపుతిప్పేదిగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తని దర్శక నిర్మాతలు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబందించి ఓ డైలాగ్ కూడా వైరల్ అవుతోంది. “అడవిలో జంతువులు నాలుగడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్దం అవుతోంది. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్దం.”