ఒకరు మెగా మాస్... మరొకరు మాస్ మహరాజ్... డిసెంబర్ 12న!

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్ జంటగా కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్య సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదల కాబోతోంది. చిరంజీవి ఓ మాస్ హీరోకాగా ఈ సినిమాలో మారో మాస్ మహారాజ్ రవితేజ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాలో తన పరిచయం గురించి అందరూ ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. కనుక మీ అందరికీ మరో సరికొత్త నన్నును సోమవారం ఉదయం 11.07 గంటలకి పరిచయం చేయబోతున్నాయనని రవితేజ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ‘మాస్ ఈజ్ కమింగ్’ పేరుతో ఓ పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో రవితేజ గొడ్డలితో గ్యాస్ సిలెండర్‌ని లాక్కొని వెళుతూ ఏదో పెద్ద విస్పోటనం చేయడానికి బయలుదేరుతున్నట్లు చూపారు. 

వాల్తేర్ వీరయ్యాలో కేథరిన్ థెరీసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కృషోర్, బాబీ సింహా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో భామ ఊర్వశీ రౌతేల ఓ ఐటెమ్ సాంగ్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం బాస్ పార్టీ... అంటూ సాగే ఈ లిరికల్ వీడియోలో చిరంజీవి, ఊర్వశీ చేసిన డ్యాన్స్‌ చూసి అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.     

వాల్తేర్ వీరయ్య సినిమాని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కధ, డైలాగ్స్: బాబి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు.