
ఇప్పుడు అనేక ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రతీవారం కొత్త కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్ చూసే అవకాశం లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు వివిద ఓటీటీలలో విడుదల కాబోతున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవలసింది సమంత నటించిన యశోద చిత్రం. సమంత మయో సైటీస్ వ్యాధికి గురైనప్పుడు చేసిన చివరి సినిమా ఇది. ఆమె ప్రస్తుతం దక్షిణకొరియాలో ఆ వ్యాధికి ఆయుర్వేద చికిత్స తీసుకొంటుండగా ఆమె నటించిన యశోద చిత్రం డిసెంబర్ 9నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది.
కొత్త దర్శకుడు ఎంఎస్ రాజశేఖ రెడ్డి దర్శకత్వంలో నితిన్, కృతిశెట్టి, కేథరిన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఈ నెల 9వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం థియేటర్లలో మంచి టాక్ సంపాదించుకొంది. ఇది కూడా రేపటి నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువహీరో సంతోష్ శోభన్, ఫారియా జంటగా నటించిన లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమా కూడా శుక్రవారం నుంచి సోనీలివ్‌లో ప్రసారం కాబోతోంది.
ఇవి కాక నెట్‌ఫ్లిక్స్‌లో కాంతారా (హిందీ వెర్షన్), మంచి ప్రజాధారణ పొందిన మనీ హెయిస్ట్ (వెబ్ సిరీస్), డ్రాగన్ ఏజ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), డ్రీమ్ హోమ్ మేక్ ఓవర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) శుక్రవారం నుంచి డాక్టర్ జీ (హిందీ వెబ్ సిరీస్) ఆదివారం నుంచి ప్రసారం కానున్నాయి.