నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతోంది. దీని తర్వాత బాలకృష్ణ 108వ సినిమాకి హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో నేడు పూజా కార్యక్రమాలు జరిగాయి.
ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తదైతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అల్లు అరవింద్ దేవుడి పఠాలపై క్లాప్ కొట్టగా, కె.రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు.
షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించబోతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌లో నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్ల పేర్లు త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.
ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్‌గా ‘ఆన్‌స్టాపబుల్’ టాక్ షోలో ఆయనలోని మంచి కమెడియన్ కూడా ఉన్నారని నిరూపించింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2, ఎఫ్-3 కామెడీ సినిమాలు రెండు హిట్ అవడంతో ఈ సినిమాలో బాలయ్యని ఏవిదంగా చూపుతారనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్ దాదాపు పూర్తవుతోంది. అది పూర్తికాగానే ఈ సినిమాని మొదలుపెట్టి వచ్చే వేసవిలో విడుదల చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు తెలుస్తోంది.