విరూపాక్ష ఫస్ట్ గ్లింప్స్ వీడియో... పర్వాలేదు

సాయి ధరమ్ తేజ సినిమాకి విరూపాక్ష టైటిల్‌ ఖరారు చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ వీడియోని ఈరోజు ఉదయం రిలీజ్‌ చేశారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ఈ సినిమాలో సంయుక్తా మెనన్ హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 21వ తేదీన విరూపాక్ష రిలీజ్‌ డేట్ ఫిక్స్ చేసినట్లుఫస్ట్ గ్లింప్స్ వీడియోలో చూపారు. 

ఓ గ్రామంలో మూఢనమ్మకాలు, భయాలు, చేతబడి తదితర అంశాలతో విరూపాక్షని తెరకెక్కిస్తున్నట్లు వీడియో చూస్తే అర్దమవుతుంది. ఈ వీడియోకి జూ.ఎన్టీఆర్‌ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది కధాంశానికి చక్కగా కనెక్ట్ చేసింది. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం కార్తీక్ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: శామ్ దత్, ఎడిటింగ్: నవీన్ నూలి, వీఎఫ్ఎక్స్: డిటిఎం లవన్ కుశన్ అందిస్తున్నారు. 

నిఖిల్ నటించిన కార్తికేయ-2 సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు అటువంటి కధలతో పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. విరూపాక్ష కూడా ఉత్తరాది ప్రేక్షకులతో కనెక్ట్ అవగలిగితే సూపర్ హిట్ అవుతుంది లేకుంటే సాయి ధరమ్ తేజ కెరీర్‌లో మరో ఫ్లాప్ పడుతుంది.