సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా తెర కెక్కించిన రొమాంటిక్ సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా బుదవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమన్నా సూచన మేరకు సత్యదేవ్ తన భార్య దీపికని అభిమానులకి పరిచయం చేస్తూ ఈమే నా భార్య... నా కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. నాకు, నా సినిమాలకి ఆమె ఎల్లప్పుడూ అండగా నిలబడి నన్ను ప్రోత్సహిస్తుంటుంది,” అని భార్యని ప్రశంసించాడు.
ఇక ఈ సినిమా వివరాలలోకి వెళితే... నాగశేఖర్ ధర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లున్నారు. ఈ సినిమాకి కధ డార్లింగ్ కృష్ణ, సంగీతం: కాల భైరవ, కెమెరా: సత్యా హెగ్డే, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌లపై భవానీ రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించారు. ఎటువంటి హడావుడి, అంచనాలు లేకుండా ఈ సినిమా బుదవారం విడుదల కాబోతోంది.