పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా ఖరారు.. దర్శకుడు ఎవరంటే?

ఇటు సినిమాలలో, అటు రాజకీయాలలో రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహరవీరమల్లు సినిమాకి సమయం కేటాయించి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా లైన్లో ఉంది. అది కాకుండా తాజాగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో మరో సినిమాకి సంతకం చేశారు. ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై దాని అధినేత డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దానిలో పవన్‌ కళ్యాణ్‌ అస్తమిస్తున్న సూర్యుడు ఎదుట నిలబడిన్నట్లు చూపారు. ఎదురుగా లీలగా  హైదరాబాద్‌ నగరాన్ని చూపారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ నీడని తుపాకీలాగ చూపడం చాలా ఆకట్టుకొంటుంది. పైన దే కాల్ హిమ్ #ఓజీ అని క్యాప్షన్ ఇచ్చారు. 

ఈ సినిమాకి రవి కే చంద్రన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని పోస్టరులో తెలియజేశారు. ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో తిరుగుతుండటంతో ఆయన సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఈ సినిమా ప్రకటన తప్పకుండా చాలాసంతోషం కలిగిస్తుంది.