'దంగల్' ట్రైలర్ తో దుమ్ములేపిన అమీర్..!

అమీర్ ఖాన్ నటిస్తున్న దంగల్ ఫస్ట్ లుక్ చూసినప్పటి నుండి ఆ సినిమా మీద అంచనాలు పెరిగాయి. రియల్ లైఫ్ స్టోరీతో వస్తున్న దంగల్ మూవీ మహావీర్ సింగ్ జీవిత చరిత్రతో తెరకెక్కుతుంది. కుస్తీ యోధుడిగా తాను పొందలేని విజయాలను తన కూతుళ్లతో గెలుపొందేలా చేసిన ఆయన కథే ఈ దంగల్. అయితే యువకుడిగా, ఆ తర్వాత ముగ్గురు బిడ్డల తండ్రిగా అమీర్ ఖాన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దీని కోసం వెయిట్ పెరగడం తగ్గడం లాంటివి చేశాడు అమీర్.      

ఇక కొద్ది గంటల క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తే నోట మాటరాదంటే నమ్మాలి. వ్రెజ్లర్ గా తన కూతుళ్లను అమీర్ తయారు చేసే విధానం సినిమాకే హైలేట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. నితేష్ తివారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే సల్మాన్ సుల్తాన్ గా వచ్చి హిట్ అందుకున్నాడు. అమీర్ కూడా ఇందులో వ్రెజ్లర్ గా కనిపించినా తన కూతుళ్లతో గోల్డ్ మెడల్ సాధించే కుస్తి యోధుడుగా కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తే సినిమా రికార్డులను సృష్టించడం ఖాయమని చెప్పేయొచ్చు.