
ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన సూపర్ స్టార్ కృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా పలువురు, సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి నివాళులు అర్పించారు. అధికారిక లాంఛనాలతో నిన్న సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిసాయి.
అనంతరం కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ, సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రజల అందరి హృదయాలలో నిలిచి ఉన్నప్పటికీ ఆయన జ్ఞాపకార్ధం ఓ స్మారక భవనం నిర్మించాలని అనుకొంటున్నాము. దానిలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలకు సంబందించిన ప్రతీ దానిని, ఆయన అందుకొన్న అవార్డులు, ఆయన ఫోటోలు, పోస్టర్లు అన్నిటిని ఒకేచోట ఏర్పాటు చేయాలనుకొంటున్నాము. దీని ద్వారా అభిమానులకు, సినీ ప్రియులకు సూపర్ స్టార్ కృష్ణ గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. అయితే ఈ స్మారక భవనం ఎప్పుడు, ఎక్కడ నిర్మించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. మా కుటుంబ సభ్యులు అందరూ ఈ బాధ నుంచితేరుకొన్న తర్వాత అందరం కూర్చొని చర్చించుకొని నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు.
ఇప్పటి వరకు దేశంలో సినీ పరిశ్రమలో నటీనటుల విగ్రహాలు ఏర్పాటు చేయడమే తప్ప ఎవరూ ఇటువంటి ఆలోచన చేయలేదు. కనుక ఇది సరికొత్త ఆలోచనే అని చెప్పవచ్చు.