
ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, పద్మాలయా స్టూడియో వ్యవస్థాపకుడు కృష్ణ మృతికి సంతాపంగా నేడు తెలుగు సినీ పరిశ్రమలో అన్ని కార్యక్రమాలు నిలిపివేసి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ మేరకు ప్రెస్‌నోట్ విడుదల చేసింది. కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం 9 గంటలకు పద్మాలయా స్టూడియోకి తరలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచే ఆయన అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం హైదరాబాద్ చేరుకొని పద్మాలయా స్టూడియోలో కృష్ణకు నివాళులు ఆర్పిస్తారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.