
మాస్ మహరాజ్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన రవితేజ ఈ మధ్య రేసులో పూర్తిగా వెనుక పడ్డాడన్నది అందరికి తెలిసిన నిజం. అసలు రవితేజ ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నది ఎవరికి అర్ధం కావట్లేదు. వరుసగా రెండు మూడు సినిమాలు స్టార్ట్ చేయడం ఆగిపోవడం ఇలా జరుగుతున్నాయి. రీసెంట్ గా పవర్ దర్శకుడు బాబితో నేడో రేపో ముహుర్తం అనుకున్న ఆ సినిమా కూడా ఆగిపోయిందని అంటున్నారు. అయితే ఈ విషయాల పట్ల రవితేజ సమాధానం చెప్పేలా లేడు.
రవితేజతో పాటుగా సమానంగా కెరియర్ బిల్డ్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం రవితేజపై వస్తున్న రూమర్లని కొట్టీపడేశాడు. దాదాపు 15 సంవత్సరాలుగా రవితేజ కష్టపడుతున్నాడు.. ఫ్యామిలీలో వరల్డ్ ట్రిప్ లో ఉండబట్టి సినిమాలు చేయట్లేదు తప్ప తను రెమ్యునరేషన్ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు అంటున్నాడు పూరి. అఫ్కోర్స్ పూరి చెప్పాడంటే కచ్చితంగా అందులో నిజం ఉన్నట్టే ఎందుకంటే రవితేజతో పూరికున్న అనుబంధం అలాంటిది.
అదేదో త్వరగా పూర్తి చేసుకుని రవితేజ మళ్లీ ఫాంలోకి వస్తే ఆయన్ను అభిమానించే అభిమానులు ఎంతో సంతోషిస్తారు. కమర్షియల్ సినిమాలకు కామెడీని అద్ది హిట్లు కొట్టే ఓ సరికొత్త విధానాన్ని తన సినిమాతోనే ఇంట్రడ్యూస్ చేసిన రవితేజ మళ్లీ రేసులో పరుగెత్తడం స్టార్ట్ చేసే రోజు కోసం అతని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఆరోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం.