యాంకర్ నుంచి నటిగా మారిన రష్మి, యువహీరో నందుతో కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటిచింది. ఈ సందర్భంగా వారిరువురూ మీడియాతో మాట్లాడినప్పుడు, ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు రష్మి చాలా ఘాటుగా, ఊహించని సమాధానం చెప్పింది. “సుడిగాలి సుధీర్‌తో మీది స్నేహమా... ప్రేమ వ్యవహారమా... పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా?” అని విలేఖరి ప్రశ్నించగా, “నా జీవితం నా ఇష్టం. అందరికీ నచ్చేలా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితం గురించి, నా ఆలోచనలు, నిర్ణయాల గురించి అందరికీ వివరించుకొంటూ పోతే అది నా జీవితమే అవదు. మా ఇద్దరి మద్య ఎటువంటి బంధం ఉందో అది అందరికీ వివరించాల్సిన అవసరం లేదు.
భవిష్యత్‌లో ఏం జరుగుతుందో మాకే తెలియదు. కానీ మేం ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లోనూ ఒకేలాగా ఉంటాము. మేమిద్దరం పదేళ్ళు కలిసి ప్రయాణం చేశాము. అయితే అది అనుకొని చేసింది కాదు. అలా జరిగిపోయింది అంతే. ఓ మంచి పాట, మంచి సంగీతంలాగ మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది కనుకనే మీకు ఇటువంటి సందేహాలు కలుగుతున్నట్లు నేను భావిస్తున్నాను. దానిని అందరూ ఆస్వాదిస్తే సంతోషమే కానీ ఇలా నన్ను నిలదీయడం సరికాదు. అందుకు నేను అంగీకరించను కూడా,” అని రష్మి జవాబు చెప్పింది.