అతనే నాకు స్పూర్తి... యశోద ప్రమోషన్స్‌లో పాల్గొంటా: సమంత

మయోసైటీస్ అనే వ్యాధికి గురైన సమంత యశోద ప్రమోషన్స్‌లో పాల్గొనదని ఆ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే నేను ప్రమోషన్స్‌లో పాల్గొంటానంటూ సమంత సోషల్ మీడియాలో సందేశం పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

“నా స్నేహితుడు రాజ్‌ నిడిమోరు ఏం చెప్తారంటే, ‘రోజు ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ నేను ఉదయాన్ని లేచి స్నానం చేసి తయారయ్యి నా కార్యక్రమాలలో పాల్గొంటాను,’ అని చెప్తారు. నేను కూడా ఆయన స్ఫూర్తితో యశోద ప్రమోషన్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకొన్నాను,” అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం పెట్టింది. దాంతో పాటు తన తాజా ఫోటోని కూడా పోస్ట్ చేసింది. 

ఓ పక్క మయొసైటీస్ వ్యాధి ఆమెను క్రుందగీస్తున్నా తన సినిమా కోసం సమంత ఇంతగా తాపత్రయపడుతుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె పట్టుదలకు, పోరాట స్పూర్తికి అభిమానులే కాదు యావత్ సినీ లోకం జేజేలు పలుకుతోంది. కొంత మంది హీరోయిన్లు వేరే సినిమాలున్నాయనో, పెళ్లయిందనో, పిల్లలున్నారనో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనకుండా తప్పించుకొంటుంటారు. కానీ సమంత ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కూడా లేని ఓపిక తెచ్చుకొని మరీ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు రావాలనుకోవడం చాలా గొప్ప విషయమే కదా?