రామబాణానికి తిరుగులేదు కానీ... ఆదిపురుష్‌కి కాదు!

రామబాణం ఒకసారి సంధిస్తే దానికి తిరుగులేదంటారు. కానీ శ్రీరాముడి దివ్యగాధను కధాంశంగా తీసుకొని ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్‌ శ్రీరాముడిగా తీస్తున్న ఆదిపురుష్‌ సినిమాకి మొదటి నుంచి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. 2023, జనవరి 12వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించిన దర్శకుడు ఓం రౌత్, ఇప్పుడు 2023 జూన్ 16కి దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. 

“ఆదిపురుష్‌ కేవలం సినిమా మాత్రమే కాదు. శ్రీరాముడి పట్ల, మన సమ్క్సృతీ, చరిత్రల పట్ల మన నిబద్దతను ప్రతిభింబించేది ఆదిపురుష్‌. కనుక ప్రేక్షకులకు మరింత అద్భుతమైన అనుభూతిని అందించేందుకు శ్రమిస్తున్న మా టీమ్‌కు మరింత సమయం ఇచ్చేందుకుగాను ఆదిపురుష్‌ చిత్రాన్ని 2023, జూన్ 16వ తేదీన విడుదల చేయబోతున్నాము. భారతీయులందరూ గర్వించేవిధంగా ఈ సినిమాను రూపొందించే విదంగా ఈ సినిమాను తీర్చిదిద్దేందుకు మేము గట్టిగా కృషి చేస్తున్నాము. ఇందుకు మీ మద్దతు, ప్రేమ, ఆశీర్వచనాలు ఎంతో అవసరం,” అని ట్వీట్ చేశారు. 

ఆదిపురుష్‌ సినిమా ఫస్ట్-లుక్‌ పోస్టర్‌, టీజర్‌పై దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీరాముడికి ఆ మీసాలేమిటి? హనుమంతుడు చర్మంతో చేసిన దుస్తులు ధరించడం ఏమిటి? గాలిలో ఎగురుతున్న హనుమతుడి వీపుపై శ్రీరాముడు నిలబడి యుద్దం చేయడం ఏమిటి?రావణాసురిడిఆ గెటప్ ఏమిటి?రాణాసురుడు గబ్బిలం మీద ఎగరడం ఏమిటి? వానరసేనను గొరిల్లాలా చూపడం ఏమిటి?వాస్తవ యాక్షన్ సీన్స్ చూపకుండా ఆ గ్రాఫిక్స్ ఏమిటి?సినిమా తీయడం చేతకాకపోతే కార్టూన్ సినిమా అని చెప్పుకోవచ్చు కదా?అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. 

వాటికి ఓం రౌత్ సంజాయిషీ చెప్పుకొన్నప్పటికీ విమర్శలు ఆగలేదు. బహుశః అందుకే మళ్ళీ భారతీయుల హృదయాలలో ముద్రించబడి ఉన్న ఆ రూపాలలోకి శ్రీరాముడు, హనుమంతుడు, రావణుడు, వానరసేనలను మార్చుటున్నట్లుంది. బహుశః అందుకే సినిమాను 2023, జూన్ 16కి వాయిదావేసినట్లున్నారు.