'మోహిని'గా త్రిష అదరగొడుతుంది..!

దశాబ్ధ కాలానికి పైగా ఉన్న క్రేజీ హీరోయిన్స్ ఇప్పుడు తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ప్రాకులాడుతున్నారు. ఆల్రెడీ ఆడియెన్స్ మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ భామలు ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ముందుకొస్తున్నారు వారిలో చెప్పుకుంటే ఈ మధ్య త్రిష మళ్లీ ఫాంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. నాయకి ఫ్లాప్ అయినా ఆమె అటెంప్ట్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో మోహినిగా రాబోతుంది త్రిష. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సినిమాలో విషయం ఉందనే అనిపిస్తుంది.

నీలం రంగు కాస్టూమ్స్ తో 8 చేతుల అవతారంతో ఆమె దేవతా దెయ్యమా అన్న సందేహాన్ని కలిగించేలా పోస్టర్ డిజైన్ చేయించారు. మాదేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మొత్తం ఫారిన్ లో జరిగే థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుస్తున్నారు. సినిమా మొత్త కొత్త స్క్రీన్ ప్లేతో అలరిస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. ఫస్ట్ లుక్ అయితే త్రిష లుక్ అదిరిపోయింది. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవబోతున్న ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టెజ్ లో ఉందని పోస్టర్ లో తెలిపారు.    

మరి నాయకిలా ఇది కూడా నామ మాత్రపు పోస్టర్ అరుపులేనా సినిమా కూడా కేకలు పెట్టిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. త్రిష లుక్ క్యారక్టర్ ఇంటెన్సిటీ చూస్తే కచ్చితంగా ఈ మోహిని త్రిషకు మంచి పేరు తెచ్చి పెట్టేలానే ఉంది. ఫలితం ఎలా ఉండబోతుందో సినిమా చూస్తేనే కాని చెప్పలేం.