
ప్రముఖ నటి అవికా గోర్ నిర్మాతగా మారి తనే హీరోయిన్గా చేస్తున్న ఉమాపతి సినిమా ఫస్ట్-లుక్ పోస్టరుని విడుదలైంది. తమిళంలో సూపర్ హిట్ అయిన కలవాని సినిమాను సత్య ద్వారపూడి దర్శకత్వంలో ఉమాపతిగా తెలుగులో రీమేక్ చేశారు. గ్రామీణ నేపద్యంలో సాగే వినోదాత్మకమైన కధతో తెర కెక్కిస్తున్న ఈ సినిమాలో అవికా గోర్, అనురాగ్ హీరోహీరోయిన్లుగా చేశారు. క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను కె కోటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాకు కెమెరా రాఘవేంద్ర, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సంగీతం శక్తికాంత్ కార్తీక్ అందించారు. సినిమా షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.
చిన్నారి పెళ్ళి కూతురుతో నట జీవితం ప్రారంభించిన అవికా గోర్ 2009లో ‘మార్నింగ్ వాక్’ తో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, పాఠశాల, తేజ్ సినిమాలు చేసింది. 2013లో విడుదలైన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకొంది. ఆ తర్వాత సిన్మా చూపిస్తా మావా, రాజుగారి గాడి-3, టెన్త్ క్లాస్ డెయిరీస్, థాంక్ యు సినిమాలలో నటించింది.
అవికా గోర్ హైదరాబాద్‌కు చెందిన తన ప్రియుడు మిళింద్ చంద్వానీతో సహజీవనం చేసిన తర్వాత పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితం ప్రారంభించింది. అప్పటి నుంచి సినిమాలలో నటిస్తూనే నిర్మాతగా కూడా మారింది.