
చిరు 150 సినిమా కోసం ఎంత హంగామా జరిగిందో తెలిసిందే. 9 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు ఎలా ఎంట్రీ ఇవ్వాలి అన్న ఆలోచనలో చాలా మంది కథలను విని వాటికి సాటిస్ఫై అవ్వక చివరకు కత్తి రీమేక్ కు ఫిక్స్ అయ్యాడు. ఇక దాన్నే ఖైది నెంబర్ 150గా తెరకెక్కిస్తున్న చిరంజీవి ఆ సినిమా తర్వాత తీయబోయే రెండు సినిమాలు అంటే 151, 152 సినిమాలను ఫిక్స్ చేసుకున్నాడట.
ప్రస్తుతం ఖైది నెంబర్ 150 వినాయక్ డైరక్షన్లో వస్తుండగా ఆ తర్వాత సినిమా మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో చేసే ఆలోచనలో ఉన్నాడట చిరు. ఇప్పటికే బోయపాటి చెప్పిన లైన్ కు ఫిదా అవ్వడమే కాకుండా సినిమా కన్ఫాం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 151వ సినిమా అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ సమర్పణలో వస్తుందట. ఇక 152వ సినిమా నాగ బాబు నిర్మిస్తారని అంటున్నారు. ఆరెంజ్ తర్వాత నాగ బాబు మళ్లీ సినిమా నిర్మాణంలో జోక్యం చేసుకోలేదు.
అయితే కొత్తగా కొణిదెల ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి ఆ సంస్థతో కలిసి తన అంజని ప్రొడక్షన్ తో చిరంజీవి 152వ సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా తేల్చలేదు. సో మొత్తానికి చిరు మళ్లీ తన సినిమాల వేట మొదలెట్టాడని చెప్పాలి. సంక్రాంతి బరిలో దిగుతున్న ఖైది సినిమా చిరు స్టామినా తెలియ పరుస్తుందని అంటున్నారు.