అంటే.. నాగార్జున తాజా చిత్రం ది ఘోస్ట్ గురించి అన్నమాట! ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు హాలీవుడ్ రేంజ్లో తీసినా సినిమాలో ప్రేక్షకులను మెప్పించలేకయింది. దీంతో థియేటర్లలో రిలీజ్ అయిన రెండు రోజులకే కలెక్షన్స్ పడిపోయాయి. సినీ ఇండస్ట్రీలో నిర్మాతలతో ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజ్ (అక్టోబర్ 5న) అయిన 8వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉండగా నాలుగు వారాలకే అంటే నవంబర్ 2వ తేదీనే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్నట్లు తాజా సమాచారం.
ఈ సినిమాలో నాగార్జున జోడీగా నటించిన సోనాల్ చౌహాన్ అందాలను ఆరబోసినప్పటికీ ఆమె కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మించారు. ఈ సినిమాకు భరత్, సౌరభ్ సంగీతం అందించారు.