
నందమూరి కళ్యాణ్ రాం హీరోగా పూరి డైరక్షన్లో వస్తున్న ఇజం ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ చురుగ్గా పాల్గొంటున్న కళ్యాణ్ రాం తన తర్వాత సినిమాల విషయాలను గురించి చెబుతూ మెగా హీరో సినిమా పట్ల షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొద్దిరోజులుగా మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నందమూరి కళ్యాణ్ రాం కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారని టాక్ ఉంది.
రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా న్యూస్ నిన్న మొన్నటిదాకా హాట్ న్యూస్ అయ్యింది. కాని కళ్యాణ్ రాం మాత్రం ఇంకా ఆ సినిమా గురించి ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. రేపో మాపో ముహుర్తం పెట్టేయడమే అన్నంత ఊపు చేసి మళ్లీ సడెన్ గా కళ్యాణ్ రాం ఇలా షాక్ ఇచ్చేండి అని అందరు డౌట్ పడుతున్నారు. అయితే మెగా నందమూరి సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి అందుకే ఆ కథ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
మరి కళ్యాణ్ రాం చెప్పిన దాని బట్టి చూస్తే అసలు సినిమా ఉంటుందా లేదా అన్న క్లారిటీ కూడా లేదన్నమాట. సాయి ధరం తేజ్ తో చేస్తే కళ్యాణ్ రాం ఇమేజ్ కు ఏమన్నా దెబ్బ పడే ఛాన్స్ ఉంటుందని ఏమన్నా వెనక్కి తగ్గి ఉండొచ్చు.. అలా అనుకోకుండా ఓ సినిమా కోసం కలిసి పనిచేస్తే వరకు మరో క్రేజీ కాంబినేషన్ షురూ అయినట్టే.