
మెగాస్టార్ ఖైది నెంబర్ 150లో ఐటం గాళ్ గా ముందు కేథరిన్ ఓకే చేసినా ఆ తర్వాత ఆమెను తప్పించి రాయ్ లక్ష్మిని తీసుకున్నారు. లారెన్స్ మాస్టర్ ఐదు రోజుల డేట్స్ లోనే ఈ సాంగ్ ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో కేథరిన్ కాదన్నాక వెంటనే రాయ్ లక్ష్మితో బేరం కుదుర్చుకున్నారు. అయితే ఈ సాంగ్ కోసం అమ్మడు ఏకంగా 40 లక్షలు తీసుకుంటుందట. ఓ స్టార్ హీరోయిన్ రేంజ్లో డిమాండ్ చేస్తున్న అమ్మడు అంతకు అంత అందాలను చిందిస్తుందట. తమన్నా కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఐటం సాంగ్ అంటే 50 లక్షలు అనేస్తున్నారు.
మరి వారికి తోడుగా రాయ్ లక్ష్మి కూడా అంత క్రేజ్ లేకున్నా సరే బాగానే డిమాండ్ చేస్తుంది. ఇక సౌత్ లో విశ్వ ప్రయత్నాలు చేసినా ఓ ఇమేజ్ రాకపోయే సరికి బాలీవుడ్లో హాట్ ఇమేజ్ కోసం జూలీ-2 లో నటిస్తుంది అమ్మడు. ఓ పక్క జూలీ మరో పక్క మెగా ఐటం ఈ రెండు సక్సెస్ అయితే సౌత్ లో కూడా మళ్లీ అమ్మడు ఫాంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక రీసెంట్ గా మెగాస్టార్ మూవీలోని ఐటం సాంగ్ స్టిల్స్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మెగా ఐటంగా మెరుపులు మెరిపిస్తున్న రాయ్ లక్ష్మి చిరుతో ఎలా అదరగొట్టిందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.