జగన్ కే నా ఓటు : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టూ ఫాం వచ్చేలా చేసిన జనతా గ్యారేజ్ రిజల్ట్ తర్వాత తన మీద మరింత భారం పెరిగిందని ఆలోచనలో పడ్డాడు తారక్. కెరియర్ తొలి నాళ్లలో రికార్డులు బద్ధలు కొట్టే హిట్లు కొట్టినా రీసెంట్ గా స్టార్ హీరోల రేసులో వెనుకపడ్డాడంటే అది కచ్చితంగా తను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే అని తెలుసుకున్న జూనియర్ ఇప్పుడు తన తర్వాత సినిమాల కోసం మరింత జాగ్రత్త పడుతున్నాడు. వక్కంతం వంశీ చెప్పిన స్టోరీ లైన్ బాగుందని అనిపించినా రిస్క్ చేస్తే మళ్లీ వచ్చిన హిట్ ఫాం మళ్లీ వెనక్కి పోయే అవకాశం ఉంది.

ఇక కసితో ఇజం అంటూ కత్తులు నూరుతున్న జగన్ ని అదేనండి పూరి జగన్నాథ్ ను నమ్ముదామా అంటే కొంతవరకు బెటరే కాని కన్ఫాం చేసుకోలేకపోతున్నాడు. వంశీ లేకపోతే పూరినే ఆప్షన్ కాబట్టి పూరితోనే సాధ్యమైనంత వరకు ఎక్కువ సేపు స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడట తారక్. ఎందుకంటే టెంపర్ తో తనకు స్టార్ గా మళ్లీ ఓ సెపరేట్ ట్రేడ్ మార్క్ అందించిన పూరి కచ్చితంగా తనకు మళ్లీ దాని కన్నా ఇంకా పెద్ద రేంజ్ సినిమా ఇస్తాడని నమ్ముతున్నాడు.     

పూరితోనే తన తర్వాత సినిమా కన్ఫాం చేసే ఆలోచనల్లో ఉన్న జూనియర్ ఆ సినిమా కథ కథనాల విషయంలో కూడా బాగా ఇన్వావ్ల్ అయ్యి ఉంటున్నాడట. హిట్ ఇచ్చిన కిక్ ఓ పక్క ఎంజాయ్ చేసేలా ఉన్నా దాన్ని కాపాడుకునేందుకు స్టార్లు కూడా ఇలాంటి కష్టాలు పడాల్సి ఉంటుంది. దాదాపు పూరితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని టాక్ వస్తుంది. మరి అది ఎలాంటి సినిమానో ఎంతటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.