
బాహుబలి కంక్లూజన్ కు సంబందించిన అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్న రాజమౌళి అండ్ టీం సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రయత్నాలు ఓ ఆరు నెలల ముందు నుండే స్టార్ట్ చేసింది. అయితే ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్న రాజమౌలి అది హైదరాబాద్ లో కాకుండా ముంబయిలో ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఫిల్మ్ ఫెస్ట్ జరుగుతున్న ముంబాయిలో అయితే సినిమా గురించి ఇంకాస్త క్రేజ్ వచ్చే అవకాశం ఉందని అక్కడే బాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్యలో ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారట.
ఇందుకు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అదే ప్లాన్లో ఉన్నారు. బిగినింగ్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి సంచలన విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ పార్ట్-2 మాత్రం ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించింది. అసలు సినిమా సెకండ్ పార్ట్ లోనే అంటూ చిత్రయూనిట్ ఇస్తున్న ఫిల్లర్స్ అన్ని సినిమా ప్రచారానికి ఉపయోగపడుతున్నాయి.
ఇక ముంబయిలో రిలీజ్ చేసే బాహుబలి కంక్లూజన్ ఫస్ట్ లుక్ కార్యక్రమంలో రాజమౌళి, ప్రభాస్, రానాలతో పాటుగా సినిమా ప్రొడ్యూసర్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. రిలీజ్ కు ఆరు నెలల ముందు నుండే పబ్లిసిటీ చేపట్టిన జక్కన్న కంక్లూజన్ తో ఏ రేంజ్ ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.