వచ్చే ఏడాది అనుష్కదేనా

సైజ్ జీరో తర్వాత దాదాపు సంవత్సరం పాటు కనిపించకుండా పోయిన అనుష్క ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యింది. అంతేకాదు వచ్చే ఏడాది మొత్తం అనుష్క సినిమాల సందడి ఉండబోతుందట. ఇప్పటికే ఈ ఇయర్ ఎండింగ్ లో సూర్య ఎస్-3 తో పలుకరించబోతున్న అనుష్క ఆ సినిమా తర్వాత నాగార్జున ఓం నమో వెంకటేశాయలో కూడా నటిస్తుంది. ఇక ఈ రెండే కాకుండా బాహుబలి పార్ట్-2 లో దేవసేనగా ఆకట్టుకోనుంది. మొదటి భాగం తన ఫ్యాన్స్ ను కాస్త నిరాశ పడేలా చేసిన స్వీటీ బాహుబలి-2 లో తన గ్లామర్ తో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయనుందట.

అంతేకాదు పిల్ల జమిందార్ అశోక్ డైరెక్షన్ లో భాగమతి సినిమా కూడా చేస్తుంది అనుష్క. సో మొత్తానికి 2017 మొత్తం నాలుగు సినిమాలతో అనుష్క సందడి చేయనుంది. కొద్దిపాటి గ్యాప్ వస్తున్న అనుష్క ఈ వరుస సినిమాలతో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. ఇక మరో పక్క భాగమతి సినిమా తర్వాత తన కెరియర్ కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు వస్తున్నాయి. మరి అదే నిజమైతే అమ్మడు చేసే సినిమాలు ఇక ఇవే చివరవి అని చెప్పాలి.