
దర్శకుడు పూరీ జగన్నాథ్ పక్కన ఎప్పుడూ కనిపించే మరో వ్యక్తి ఛార్మి కౌర్. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె ప్రమేయం తప్పక ఉంటుంది. కనుక అటు ఇండస్ట్రీలో, ఇటు బయట జనాలు కూడా వారిద్దరి మద్య ఏదో రిలేషన్ ఉందని గట్టిగా నమ్ముతుంటారు. మీడియా, సోషల్ మీడియాలో కూడా వారిద్దరి గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తూనే ఉండేవి. వాటిని వారు అప్పుడప్పుడు ఖండిస్తూనే ఉండేవారు. కానీ నేటికీ ఆ ఊహాగానాలు ఆగనేలేదు.
ఇటువంటి సమయంలో పూరీ జగన్నాథ్ ఇప్పుడు తమ మద్య రిలేషన్ గురించి మాట్లాడటం విశేషమే. తన దర్శకత్వంలో నిర్మించిన లైగర్ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు, వారిరువురి రిలేషన్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెపుతూ, “ఒకవేళ ఛార్మికి 50 ఏళ్ళు వయసున్నా లేదా ఊబకాయంతో ఉన్నా మేమిద్దరం కలిసి తిరిగితే ఎవరూ ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేసేవారు కారు. ఒకవేళ ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకొన్నా ఈవిదంగా సందేహించేవారు కారు. కానీ ఛార్మి ఇంకా వయసులో ఉంది. ఆమె నాతో కలిసి పనిచేస్తోంది గాబట్టి మా ఇద్దరి మదే ఏదో రిలేషన్ ఉందని అందరూ అనుకొంటూ ఉంటారు. అది సహజం. అయితే ప్రతీ జంటకు పరస్పర ఆకర్షణ, శృంగారం ఉంటాయి. కానీ కొంతకాలం తర్వాత ఆ ఆకర్షణ, వాంఛలు చల్లబడిపోతాయని అందరికీ తెలుసు. కేవలం స్నేహం మాత్రమే చివరి వరకు ఉంటుంది. ఛార్మిని నేను 13 ఏళ్ళ వయసు నుంచి నేను చూస్తున్నాను. ఆమె ఇండస్ట్రీలో నిలబడేందుకు ఎంత కష్టపడిందో నేను చూశాను,” అని చెప్పారు.