పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రేపు (శనివారం) సాయంత్రం 5 గంటలకు గుంటూరులో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు నిర్మాతలలో ఒకరైన ఛార్మీ కౌర్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. స్థానిక చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఈ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
గత రెండు వారాలుగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే, లైగర్ చిత్ర బృందం కలిసి దేశమంతా చుట్టేస్తూ ప్రమోషన్స్‌తో హోరెత్తించేస్తూ సినిమాకు చాలా హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటించారు. కనుక సినీ అభిమానులు అందరూ లైగర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లైగర్ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది.
Join the Grand Pre Release Event of #Liger on 20th AUG from 5PM🤩
— Charmme Kaur (@Charmmeofficial) August 18, 2022
📍Chalapathi Institute of Technology Grounds, Mothadaka, Guntur@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @apoorvamehta18 @DharmaMovies @PuriConnects @shreyasgroup pic.twitter.com/L3rKxpS0hc