
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సిద్దమైన లైగర్ హిందీ వెర్షన్‌కి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ మొత్తం ఏడు కట్స్ వేసింది. అవన్నీ ఓ అసభ్యకరమైన పదం వినిపించకుండా బీప్ శబ్దం పెట్టవలసినవే తప్ప సన్నివేశాలకు కత్తెర పడలేదు. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ప్రకారం సినిమా రన్ టైమ్ 140 నిమిషాలు (2.20 గంటలు). సెన్సార్ బోర్డు సినిమాలో సన్నివేశాలకు కత్తెర వేయకుండా సర్టిఫికేట్ జారీ చేసినందుకు దర్శక నిర్మాతలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. బాలీవుడ్ భామ అనన్యా పాండే ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా, రమ్యకృష్ణ అతని తల్లిగా నటించారు. లైగర్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది.