
లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు హైదరాబాద్ ఇంటికి రాగానే అతని తల్లి ముందు ఇద్దరికీ దిష్టి తీశారు. తర్వాత పంతులుగారిని పిలిపించి వారికి ఎటువంటి అపకారం జరగకుండా ఉండేందుకు పూజ చేయించి ఇద్దరికీ ఆయన చేత రక్షా బందన్ కట్టించారు.
విజయ్ దేవరకొండ ఈ విషయం ట్విట్టర్‌లో తన అభిమానులతో షేర్ చేసుకొంటూ, “ఈ నేలంతా ఇండియా అంతా తిరుగుతూ అందరి ప్రేమాభిమానాలు పొందుతుంటే దేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు ఫీల్ అయ్యాము. కానీ మా అమ్మ ఆ భగవంతుడి ఆశీర్వాదం, రక్షణ ఉండాలని భావించింది. అందుకే పూజ చేయించి మా అందరికీ రక్షా బంధన్ కట్టించింది. ఇక మేము మా పర్యటనలు కొనసాగిస్తున్నా ఆమె ప్రశాంతంగా నిద్రపొగలుగుతుంది,” అని ట్వీట్ చేస్తూ తన తల్లి పూజ చేయించి, రక్షాబంధన్ కట్టిస్తున్న ఫోటోలను షేర్ చేశాడు.
లైగర్‌లో రమ్యకృష్ణకి ముద్దుల కొడుకు. నిజజీవితంలో మరో అమ్మకి ముద్దుల కొడుకు విజయ్ దేవరకొండ. లైగర్‌లో ప్రపంచాన్ని జయించిన బాక్సింగ్ ఛాంపియన్ అయినప్పటికీ తల్లికి మాత్రం బిడ్డడే కదా! అందుకే దిష్టి తీయడం, పూజలు.
పూరీ జగనాధ్ దర్శకత్వంలో సిద్దమైన లైగర్ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్‌లో చూస్తే ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. సినిమా ప్రమోషన్స్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే లైగర్‌పై చాలా భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. మరి పూరీ, విజయ్ దేవరకొండలు ఆ అంచనాలను అందుకోగలరో లేదో సినిమా విడుదలైతే తెలుస్తుంది.
This whole month touring across India and receiving so much love already felt like God's blessing!
But Mummy feels we needed his protection :)
So Poooja 😌🙏 and sacred Bands for all of us 🥰
Now she will sleep in peace while we continue our tour 😘❤️#Liger pic.twitter.com/q6ew2HFzik