విజయ్ దేవరకొండతో కలిసి నటించను

విజయ్ దేవరకొండ చేసినవి సినిమాలు కొన్నే అయినా చాలా పాపులర్ అయిపోయాడు. లైగర్ సినిమా విడుదల కాకమునుపే ఆ సినిమా ప్రమోషన్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవడం ఇంకా విశేషం. కనుక విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దొరికితే చాలని ఎదురుచూస్తున్నవారు ఎందరో.  

 అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలలో తాను ఎన్నడూ నటించనని సాయి పల్లవి చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకు ఆమె చెప్పిన కారణం సహేతుకంగానే ఉంది. “విజయ్ దేవరకొండ ఎంచుకొనే సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి. వాటిలో ముద్దు (లిప్ లాక్) సీన్లు తప్పక ఉంటాయి. అటువంటివి చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆయన సినిమాలలో నటించలేను,” అని చెప్పారు. అయితే రష్మిక మందనకు అందాల ఆరబోతకు, లిప్ లాక్‌లకు అభ్యంతరం లేదు కనుక సాయి పల్లవి స్థానంలో విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ చేసి అతనితో ముద్దూముచ్చట్లు పంచుకొంది.  

విజయ్ దేవరకొండలాగే సాయి పల్లవి కూడా విభిన్నమైన కధలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటుందని అందరికీ తెలుసు. తన పాత్రకు ప్రాధాన్యం, నటనకు అవకాశం ఉన్నవాటినే చేస్తుంటుంది. విరాటపర్వం, గార్గి, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు హిట్ కాకపోయినా వాటిలో ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ముందు కూడా మంచి కధాబలం, తన పాత్రకు ప్రాధాన్యం, అలాగే డ్యాన్స్ చేసే అవకాశం ఉన్న సినిమాలే చేస్తానని సాయి పల్లవి చెప్పింది.